Home » New Delhi
రైళ్లలో జర్నలిస్టుల రాయితీ అంశంపై లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు. కోవిడ్-19 సమయంలో రద్దు చేసిన రాయితీని పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ విజ్ఞప్తి చేశారు.
ఎలుకను చంపాడని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన వ్యక్తి తన బైక్‌ను ఎలుక పైకి పదే పదే ఎక్కించి చంపిన వీడియో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టేట్మెంట్ ఇవ్వాలని.. మణిపూర్ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపాలని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు.
స్కూటీపై వెళుతున్న తల్లీకొడుకులపై ఓ ఆంబోతు దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఆయన కుటుంబ సభ్యులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని శనివారంనాడిక్కడ కలుసుకున్నారు. షిండే వెంట ఆయన భార్య లతా షిండే, తండ్రి సంభాజీ షిండే, కుమారుడు శ్రీకాంత్, కోడలు రుషాలి, మనుమడు రుద్రాక్ష్ ఉన్నారు.
ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఢిల్లీ పోలీసులు నిషేధ ఉత్తర్వులు విడుదల చేశారు. పారా-గ్లైడర్లు, పారా-మోటర్లు, హ్యాంగ్ గ్లైడర్లు, యూఏవీలు, యూఏఎస్ఎస్‌లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్, రిమోట్ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్లు, స్మాల్ సైజ్డ్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్, పారాజంపింగ్‌లను రాజధాని గగనతలంలో ఎగురకుండా నిషేధాజ్ఞలు విధించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటుకు నోటు వ్యవహారంపై రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేపై పోటీకి 26 పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన విపక్ష కూటమి పేరుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. విపక్ష ఫ్రంట్‌కు జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి అనే పేరు పెట్టారు. అయితే INDIA పేరును ఉపయోగించుకోవడం సరికాదని, ఇది అక్రమ వినియోగం కిందకు వస్తుందని పేర్కొంటూ ఢిల్లీలోని బారాఖమ్బ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది
చ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో జాతీయ మీడియాతో జనసేనాని మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.